ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా అత్యుత్తమ సేవలు అందించిన సులోచన సేవలను జిల్లా ఎస్పీ దామోదర్ కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం బదిలీపై వెళ్తున్న డిపిఓ ఏవో ఏం. సులోచనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ దామోదర్, పోలీసు అధికారులు సులోచనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు.