పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని దర్శి పట్టణంలో సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ బాబు మంగళవారం డిమాండ్ చేశారు. దర్శి పట్టణంలోని గుజ్జుల సరళ దేవి భవనంలో ఈనెల ఆరవ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ ఆయన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.