వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చిందని మంగళవారం మద్దిపాడు మండల ఎస్సై శివరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు పొందిన తరువాత మాత్రమే గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాటు చేసే బాధ్యులు ఫోన్ లో వాట్సాప్ 7995095800 నెంబర్ కు హాయ్ అని సందేశం పంపిస్తే నిరభ్యంతర పత్రం కోసం అనుసరించాల్సిన విధానం అంతా వాట్సప్ లోకి వస్తుందన్నారు.