త్రిపురాంతకంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

80చూసినవారు
త్రిపురాంతకంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
త్రిపురాంతకంలో మంగళవారం శాఖా గ్రంధాలయంలో ఏ. పి. జే అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. భారత రాష్ట్ర పతిగా విశిష్ట సేవలందించార్నారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల ప్రసాద్, గోదా దయాకర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నరసింహ రెడ్డి , గుమ్మడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్