ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సమావేశం ఆంతర్యం ఏంటి?

63చూసినవారు
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సమావేశం ఆంతర్యం ఏంటి?
ఎర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇలా కార్యకర్తలతో సమావేశమవడం ఉత్కంఠ రేపుతోంది. కేవలం నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవడానికి ఇలా సమావేశం పెట్టారని కొందరు నేతలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్