యర్రగొండపాలెం: సీఎం చంద్రబాబుకు విరాళాలు అందజేత
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో విజయవాడ వరద బాధితుల కొరకు దాతలు ఇచ్చిన విరాళాలను స్థానిక నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సీఎం నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రూ.30,85,00 చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకున్న దాతలను చంద్రబాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.