యర్రగొండపాలెం: గిరిజనుడు ఆత్మహత్యాయత్నం
యర్రగొండపాలెంలో మంగళవారం భూమాని పెద్దులు అనే గిరిజనుడు ఆత్మహత్యకు యత్నించాడు. అలుగును వేటాడారన్న నిందితులలో ఒకడైన పెద్దులును అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. మరో మారు విచారణకు రావాలని అధికారులు ఆదేశించడంతో భయంతో పెద్దులు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల వేధింపుల వల్లే పెద్దులు ఆత్మహత్యకు యత్నించాడని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.