
పెద్దారవీడు: పెన్షన్లు పంపిణీ చేసిన టిడిపి ఇన్ ఛార్జ్
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు లో శనివారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి ఆయన పెన్షన్లు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం రూ. 1, 000 పెంచేందుకు 5 సంవత్సరాలపాటు కాలయాపన చేసిందన్నారు.