రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దర్శి లోని వైసిపి కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని దర్శిలోని గడియార స్తంభం నుండి విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు.