దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు కానున్న పరిశ్రమల పార్క్ ను దొనకొండలో శుక్రవారం అధికారులతో కలిసి సందర్శించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసే భూముల్లో ఆక్రమణలు లేకుండా చర్యలు చేపట్టాలని జెసి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్విన్, తహసిల్దార్ రమాదేవి తదితరులు ఉన్నారు.