దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణ రెడ్డి తాళ్లూరు మండలంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించని ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.