ప్రకాశం జిల్లా, గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం మున్సిపల్ కార్మికులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్న కూడా తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు.