టిడిపి కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం 6 మండలాల టిడిపి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అక్టోబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమైన టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచనలు సలహాలు ఇచ్చారు. రూ. 100 పెట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు.