ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలో మంగళవారం నాగుపాము హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన యల్లా సుబ్బారావు ఇంటిలో నాగుపాము కనిపించింది. ఆందోళన చెందిన సుబ్బారావు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు నాగుపామును పట్టుకొని సురక్షితంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. నాగుపామును బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.