ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో శనివారం పల్లె పండుగ వారోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. రూ. 80 లక్షలతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాలన్నీ పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో చేపడతామని అశోక్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.