రాచర్ల మండల అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. మండలంలోని ప్రజా సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో అశోక్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా గిద్దలూరులోని సగిలేరు వాగు నుంచి వచ్చే వరద నీరు రాచర్ల మండల కేంద్రంలోని పలు గ్రామాల చెరువుకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.