ఆర్థిక సహాయాన్ని అందించిన ఎస్ఐ నరసింహారావు

55చూసినవారు
ఆర్థిక సహాయాన్ని అందించిన ఎస్ఐ నరసింహారావు
బెస్తవారిపేట మండలం జేబికె పురం గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మారిన ముగ్గురు చిన్నారులకు బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు అండగా నిలిచారు. తన స్నేహితుల సహకారంతో వారికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందించారు. అలానే చిన్నారులు చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్ఐ నరసింహారావు ఈ సందర్భంగా అన్నారు. చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించిన స్వచ్ఛంద సేవ సంస్థలను ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్