ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

1580చూసినవారు
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం గిద్దలూరు నియోజకవర్గంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన సందర్భంగా ఈ రంజాన్ పండగ జరుపుకుంటారని మత పెద్దలు వెల్లడించారు. ఈ పండగ సందర్భంగా పేదలకు సహాయం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్