కామేపల్లి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
జరుగుమల్లి మండలం కామేపల్లిలో ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలు, కుంకుమ పూజ, గోత్ర నామర్చనలు, వాహన పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, ఈఓ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులను పూజారులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు.