యూపీలో బరేలీ నుంచి ఆమ్లా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. దీంతో అనేక బోగీలు ట్రాక్ నుండి క్రిందకు జారిపోవడంతో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ADRM పరితోష్ గౌతమ్ వెల్లడించారు.