యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారు లక్కారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ముందు వెళుతున్న కారును లారీ ఢీకొట్టింది. దీంతో ఒకదాని వెంట మరొకటి ఐదు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.