మద్యం మత్తులో రహదారిపై పడిపోవటంతో యువకుడికి గాయాలైన సంఘటన కనిగిరిలో గురువారం రాత్రి చోటు చేసుకున్నది. పట్టణంలోని ఉండగరం బిల్డింగ్ వీధిలో ఫుల్లుగా మద్యం సేవించిన యువకుడు ఒక్కసారిగా రహదారిపై పడటంతో తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనం సహాయంతో వైద్యశాలకు తరలించారు.