బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. మండలంలోని పలు దుకాణాలను, హోటళ్లను, కూల్ డ్రింక్ షాపులను శనివారం ఎస్సై మధుసూదన్ రావు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిచోట క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.