ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జనవరి 8న దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. లక్ష 50 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని మంత్రి స్వామి వెల్లడించారు. ఇప్పటికే ఆయన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు.