ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తూ పట్టుపడ్డ మద్యం సీసాలను శనివారం ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మొత్తం 380 క్వాటర్ల మద్యం సీసాలు 16 ఫుల్ బాటిల్స్, 3 బీరు సీసాలను రోడ్ రోలర్ తో తొక్కించి వాటిని ధ్వంసం చేసినట్లు ఒంగోలు డి. ఎస్. పి రాయపాటి శ్రీనివాస్, ఎక్సైజ్ డిఎస్పి వెంకట్ తెలిపారు. 30 మందికి పైగా ఈ విషయంలో కేసులు నమోదు చేసినట్లు వారు చెప్పారు.