పొదిలి నగర పంచాయితీ పరిధిలోని పలు విధుల్లో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. వాతవరణ ప్రభావంతో దోమలు విపరీతంగా పెరగడంతో చిన్నారులు,పెద్దలు ఇబ్బందులకు గురవుతున్నారు. దోమల నివారణకై రసాయన పిచికారితో పాటు, ఫాగింగ్ కుడా నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాదులు పొంచి ఉన్న క్రమంలో ఫాగింగ్ మంచి ఫలితాలు ఇస్తాయని అధికారులు చెపుతున్నారు. కమీషనర్ పూసలపాటి శ్రీనివాసరావు, శానిటరి ఇన్స్ పెక్టర్ మారుతి రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.