మార్కాపురంలో: అక్రమ నిర్మాణాలు కూల్చివేత

76చూసినవారు
మార్కాపురం చెరువులో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. కొద్దిరోజుల క్రితం చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి రెవిన్యూ అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణదారులు నోటీసులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసుల భద్రతతో జెసిబి సహాయంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్