మార్కాపురంలో వ్యక్తి అనుమానస్పద మృతి

60చూసినవారు
మార్కాపురంలో వ్యక్తి అనుమానస్పద మృతి
మార్కాపురం మండలం ఇందిరమ్మ కాలనీలో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. కాలనీకి చెందిన షేక్ చిన్న మస్తాన్ వలి కోళ్ల ఫారం వద్ద మృతి చెందిపడి ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శుక్రవారం ఇంటి నుంచి మస్తాన్ వలి బయటకు వెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్