మార్కాపురంలోని విద్యానగర్ కు చెందిన ఓ వ్యక్తికి గుప్త నిధుల పేరిట టోకరా వేసిన సంఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దారవీడు మండలం కులనూతలకు చెందిన ఓ వ్యక్తి తన పొలంలో గుప్త నిధులు ఉన్నాయని వెలికి తీసేందుకు డబ్బులు లేవని వెలికి తీస్తే అధిక మొత్తంలో నగదు ఇస్తానని మార్కాపురం కు చెందిన సుబ్రహ్మణ్యం వద్ద నుంచి రూ. 6 లక్షలు నగదు తీసుకున్నాడు. తర్వాత మొహం చాటేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.