ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆక్రమణల తొలగింపులో భాగంగా నిర్వహించిన కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఏళ్ల తరబడి పట్టణంలో ఉన్న గాంధీ పార్క్ తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెప్పింది గంగిరెద్దుల తల ఊపి అధికారులు చేస్తున్నారని ఆరోపించడంతో కమిషనర్ నారాయణరావు అసహనం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.