మార్కాపురం: విద్యుత్ షాక్ తో ఎద్దులు మృతి

60చూసినవారు
మార్కాపురం: విద్యుత్ షాక్ తో ఎద్దులు మృతి
మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో ఆదివారం రెండు ఎద్దులు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. రైతు గ్రామ సమీపంలోని పొలాలలో మేత కోసం ఎద్దులను విడిచిపెట్టాడు. మేత మేస్తూ పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైపు ఎద్దులు వెళ్లాయి. విద్యుత్ షాక్ కొట్టడంతో ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన ఎద్దుల విలువ రూ. 1, 70, 000 ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్