మార్కాపురం: బంధించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు

53చూసినవారు
మార్కాపురం మండలం గోగులదిన్నెకు చెందిన నాగరాజును రంగారెడ్డి బంధించాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నాగరాజు గతంలో రంగారెడ్డి వద్ద గుమస్తాగా పనిచేశాడు. ఆ సమయంలో రంగారెడ్డికి నాగరాజు కొంత నగదు బాకీ పడ్డాడు. తీసుకున్న నగదు చెల్లించడం లేదని నాగరాజును రంగారెడ్డి మార్కాపురంలోని ఓ ఇనుప కొట్టులో బంధించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్