మార్కాపురం: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన

76చూసినవారు
మార్కాపురం: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన
మార్కాపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై వేసిన అదనపు చార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినా విద్యుత్ చార్జీలను తగ్గించకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్