మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

55చూసినవారు
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్