ప్రకాశం జిల్లా పొదిలి తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై రైతులు, ప్రజలు ఇచ్చిన అర్జీలను మంత్రి స్వామి స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.