కొత్తూరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పొదిలి నగర పంచాయతీ అధికారులు తొలగించే కార్యక్రమానికి బుధవారం చర్యలు చేపట్టారు. 15 రోజుల క్రితమే ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ ఆక్రమణలను తొలగించుకోగా మరి కొంతమంది నిర్లక్ష్యం వహించారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జెసిబి సహాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు.