తర్లుపాడు తహశీల్దార్ విజయభాస్కర్ తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కారుమానుపల్లి గ్రామంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం ఓ మహిళ తన భూమి కబ్జాకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేసింది. సమస్య పరిష్కరించబడకపోవడంతో రెవిన్యూ సదస్సు వద్ద ఆ మహిళ నిరసనకు దిగింది. సమస్యలు పరిష్కరించడం నావల్ల కాదంటూ తహశీల్దార్ అక్కడినుంచి వెళ్ళిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.