మార్కాపురంలో ఆకట్టుకున్న కోలాటం
ప్రకాశం జిల్లా మార్కాపురం రాజాజీ వీధిలోని కోదండ రామస్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శుక్రవారం 2వ రోజు ఆలయ ప్రాంగణంలో మహిళలు, చిన్నారులు కోలాటం ప్రదర్శించారు. ఈ కోలాట ప్రదర్శనను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ రకాల భక్తి పాటలకు ప్రత్యేక దుస్తుల్లో మహిళలు కోలాటం ఆడారు.