త్రిపురాంతకం మండల కేంద్రంలో ఆదివారం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితుల వివరాల ప్రకారం గ్రామంలోని ఉప్పల గుట్ట ప్రాంతంలో ఆవుల వేంకటేశ్వర్లు ఇల్లు విద్యుత్ షాట్ సర్క్యూట్ తో దగ్ధమైంది.వేంకటేశ్వర్లు గ్రామాల్లో నిత్వవసర సరుకులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు.ఆదివరం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంట్లో నిల్వ ఉంచిన సరుకులు, బీరువాలో దాచిన 30 వేల నగదు, సామాగ్రీ అంతా కాలి బూడిదయ్యాయి.దీంతో బాధితులకు రెండు లక్షల పైగా ఆస్తి నష్టం జరిగిందని వాపోయారు.