పోలీసు కానిస్టేబుల్స్ ఎంపికను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 నుండి ఒంగోలులోని పోలీసు పరేడ్ మైదానంలో ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన తేదీ, సమయాల్లో సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు. ఎవరు దళారుల మాటలు నమ్మవద్దని, కష్టపడి ఉద్యోగాన్ని తెచ్చుకోవాలని సూచించారు.