జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉపాధి హామీ పథకం పై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీలో జాతీయ ఉపాధి హామీ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టటానికి అవకాశం ఉందన్నారు.