ఒంగోలు: విజన్ డాక్యుమెంట్ కు రెండో స్థానం

82చూసినవారు
స్వర్ణాంధ్ర-2047 విజన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా డాక్యుమెంట్లు కోరింది. అమరావతిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రంగాల వారి దృష్టి సారించాల్సిన అంశాలు, వాటి సాధనకు చేపట్టాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ కలెక్టర్ అన్సారియా ఇచ్చిన ప్రజెంటేషన్ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. డాక్యుమెంటును సమగ్రంగా రూపొందించారంటూ సీఎం చంద్రబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్