ప్రజల వద్ద పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా మెలగాలని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులకు గురువారం జూన్ వీడియో కాన్ఫరెన్స్ ను ఎస్పి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.