ఒంగోలులో పోలీసుల విచారణకు రాలేనని పేర్కొంటూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ మంగళవారం పంపించారు. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో వారం రోజులు గడువు కావాలన్నారు. దర్యాప్తుకు సహకరిస్తానన్నారు. రాంగోపాల్ వర్మ షూటింగ్‌లో ఉన్నారా..లేదా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్మ ఎక్స్‌లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. దీనిపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.