ఒంగోలులోని టిడిపి కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అందజేశారు. 18 మంది లబ్ధిదారులకు రూ. 13 లక్షలు విలువ గలిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావటంతో లబ్ధిదారులందరికీ సోమవారం ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.