దరఖాస్తుదారుల సమక్షంలోనే పారదర్శకంగా లాటరీ తీస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ లో మద్యం లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాటరీ తీసే విధానంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, లాటరీ పూర్తి వీడియో, కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.