మార్టూరు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నీటి శుద్ధి యంత్రాన్ని మండల విద్యాశాఖ అధికారి వస్రాం నాయక్ ప్రారంభించారు. రమవత్ వెంకట హరి గణేష్ నాయక్ పుట్టిన రోజు సందర్భంగా వారి తండ్రి బుజ్జీ నాయక్ శుక్రవారం ఈ నీటి శుద్ధి యంత్రాన్ని బహూకరించారని విద్యాశాఖ అధికారి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుమలేశ్వర రావు, ఎలిసమ్మ, రమవత్ బుజ్జీ నాయక్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.