విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యూ ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా పిడిఎస్ యూ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని,ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలన్నారు.అదే విధంగా మార్కాపురంలో యూనివర్సిటీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.