ఇసుక ట్రాక్టర్, టిప్పర్ సీజ్

71చూసినవారు
ఇసుక ట్రాక్టర్, టిప్పర్ సీజ్
తాళ్లూరు పరిసర ప్రాంతం నుండి బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకలోడుతో వస్తున్న రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేసినట్లుగా మద్దిపాడు సబ్ ఇన్స్పెక్టర్ శివరామయ్య బుధవారం తెలిపారు. బెల్లంపల్లి సమీపంలో అనధికార ఇసుక టిప్పర్లు, ఒక ట్రాక్టర్ ను ఈ మేరకు పట్టుకుని సీజ్ చేసి, ఆయా వాహనాలను మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా ఎస్సై శివరామయ్య పేర్కొన్నారు.