సంతనూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య ద్వారా మంచి భవిష్యత్తును అందించాలని తెలిపారు.